ఈశాన్య రాష్ట్రాలు.. కర్ణాటక, రాజస్థాన్ ఒక్కటేనా?

ఈశాన్య రాష్ట్రాలు.. కర్ణాటక, రాజస్థాన్ ఒక్కటేనా?
x
Highlights

నిజమే. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించిన మాట వాస్తవమే. ఈ గెలుపుతో.. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని...

నిజమే. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించిన మాట వాస్తవమే. ఈ గెలుపుతో.. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. కొన్ని చోట్ల.. బీజేపీ మిత్ర పక్షంగా ఉండగా.. అధికారంలో మరో పార్టీ రాజ్యాలను ఏలుతున్నాయి. అయినా.. ఆ పార్టీలు ఎన్డీయేలో భాగం కాబట్టి.. 21 రాష్ట్రాల్లో కమలం వికసించిందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.

అంతా బానే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా కూడా ఆ పార్టీలో జోష్ నింపింది. కానీ.. ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే.. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ మధ్య బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా విఫలమైంది. అలాగే.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుకున్నంతగా ప్రజా వ్యతిరేకత కనిపించడం లేదు.

దీంతో.. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎంత వరకూ నెగ్గుకురాగలదు.. అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించినంత ప్రభుత్వ వ్యతిరేకతే.. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోనూ కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందన్న మాట కూడా వాస్తవమే అవుతుంది. ఇక.. కర్ణాటకలో ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో ఇరకాటంలో పడిన యడ్యూరప్ప లాంటి నేతలు.. బీజేపీని ఎంతవరకూ విజయబాటలో నడిపిస్తారన్నది కూడా అనుమానాస్పదమే.

అందుకే.. ఈశాన్య రాష్ట్రాలు.. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఒక్కటి కాదన్న మాటను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలంటే.. చెమటోడ్చక తప్పదన్న అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories