Top
logo

కిమ్ బ్రీఫ్ కేసును చంకలో పెట్టుకుని తిరిగేంత విధ్వంస ప్రియుడు

Highlights

అమెరికాని నువ్వో కుక్క... అంటాడు. వాడో మెంటలోడు అని తేల్చేస్తాడు. నాతో పెట్టుకుంటే పుట్టగతులండవ్ అంటూ...

అమెరికాని నువ్వో కుక్క... అంటాడు. వాడో మెంటలోడు అని తేల్చేస్తాడు. నాతో పెట్టుకుంటే పుట్టగతులండవ్ అంటూ దుమ్మెత్తిపోస్తాడు. అలా అని అమెరికాలో కొంత బలవంతుడు కూడా కాదు. ఓ చిన్న దేశానికి పెద్ద నియంత. అణుబాంబు మీటలున్న బ్రీఫ్‌కేస్‌ను చంకలో పెట్టుకుని తిరిగేంత విధ్వంస ప్రియుడు. నా మాటే శాసనమంటూ ఫత్వాలు జారీచేసేంత పరమశాడిస్టు. ఎక్కడ ఏ పంచాయతీ జరుగుతున్నా, నాకేంటి లాభం? అని లెక్కలేసుకుని మరీ దూరిపోయే బీభత్స బేహారి. ఆయుధాల్ని అమ్ముకోడానికి యుద్ధాల్ని ప్రోత్సహిస్తాడు, ఆధిపత్యం కోసం ఉగ్రవాదాలకు ఊతమిస్తాడు. విభజించి పాలిస్తాడు, జుట్లు ముడేసి తమాషా చూస్తాడు. అతడి హూంకరింపులకు...చిన్నాపెద్దా దేశాలన్నీ ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అని వణికిపోతాయి. అలా అని, తనేం పులో సింహమో కాదు... కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఉత్తర కొరియా అధ్యక్షుడు. అణ్వాయుధాలతో ఆడుకోవడం, అణుబాంబులతో తలగోక్కోవడం అతడి అభిరుచులు. అతడివన్నీ, ఉత్తుత్తి బెదిరింపులో, ఉత్తరకుమార ప్రతిజ్ఞలో కానేకాదు. కిమ్‌... అమ్ములపొది నిండా అణ్వాయుధాలున్నాయి. ఆ అణ్వాయుధాలే కాదు వేయిపడగల విషంతో సమానమైన వీఎక్స్ అనే రసాయనం కూడా ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ రసాయనాన్ని చూసుకొనే యమకింకరుడు విర్రవీగిపోతున్నాడు. అందుకే బొట్టు మీద పడినా చావు తప్పని ఈ వీఎక్స్‌ రసాయనంతోనే ఉత్తరకొరియా అధ్యక్షుడి సోదరుడు నామ్‌ హత్య జరిగిందని మలేషియా పోలీసులు తేల్చారు.

వయసులో పెద్దవాడైన నామ్..కిమ్ కంటే చాలా ఉత్తముడు. ఉత్తర కొరియా పీఠానికి పోటీపడేందుకు అవకాశం ఉన్నా.. ఎన్నడూ ఆ విషయంలో నామ్ ఆసక్తి ప్రదర్శించేవాడుకాదు. దీంతో 210లో దేశాధ్యక్షుడిగా కిమ్ ప్రమాణం చేసినప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు. ఉన్ దేశాధ్యక్షుడు కావడం తన తండ్రి అభీష్టమంటూనే.. వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే.. మూడో తరం వారసత్వం చేపట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని జపాన్ టీవీకి చెప్పారు. నామ్‌కు ఉత్తరకొరియా అధికారవర్గంలో బలమైన నిఘా వ్యవస్థ ఉండేదని విశ్లేషకులు చెప్తున్నారు. చైనాగానీ, అమెరికాగానీ గట్టి మద్దతు ఇస్తే నామ్ దేశాధ్యక్షుడయ్యేవాడని వదంతులు కూడా వచ్చాయి. అదే కిమ్ జోంగ్ ఉన్‌కు ఆగ్రహం కలిగించింది. అంతే నామ్ జీవించివుంటే ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదన్న భావనతో ఉన్న కిమ్ తన అన్న నామ్ ను వీఎక్స్ రసాయనంతో మహిళలతో పూయించి హత్య చేయించారు. మరి అలాంటి వీఎక్స్ ఎవరు తయారు చేశారు. కిమ్ జాన్ దగ్గర ఎన్నిటన్నుల రాసాయనం ఉందనేది ప్రపంచానికి తెలియని అంతు చిక్కని ప్రశ్న.
వీఎక్స్
వీఎక్స్‌. నర్వ్స్‌ ఏజెంట్‌. సైనైడ్‌ కన్నా అత్యంత ప్రమాదకరమైనది. అంతకుమించిన శక్తిమంతమైనది. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వంలోనే భీకరమైన హాలహాలం ఈ వీక్స్‌.1950లో బ్రిటన్‌లోని కెమిస్ట్‌ రనాజీ ఘోష్‌ తొలిసారిగా తయారు చేశారని భావిస్తున్నారు. 1961లో అమెరికా పెద్ద ఎత్తున దీన్ని తయారు చేసింది. ఇరాక్‌ కూడా 50 టన్నుల వరకు రూపొందించింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విషం వీఎక్స్‌. దీన్ని తాకితే చాలు.. బతకడం కష్టమే. కొన్ని గంటల్లోనే మటాష్‌ కావాల్సిందే. రుచి.. వాసన లేకుండా కాషాయ రంగులో ఉండే.. ఈ వీఎక్స్‌ హిస్టరీ ఇప్పుడు మిస్టరీగా మారింది. వీఎక్స్‌... ఒక కెమికల్‌ వెపన్‌. శరీరంపై పడితే ఇక అంతే. దీన్ని సైనైడ్‌ లాగా నోటిలో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్‌ అలా బాడీపై వన్‌ డ్రాప్‌ వేస్తే చాలు. నాడీ వ్యవస్థను నాశనం చేసేస్తుంది. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. వెంటనే పక్షవాతం వస్తుంది. ఆ వెంటనే శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరి ఆగిపోతుంది. మనిషి చనిపోతాడు.
వీఎక్స్‌ కన్నా మరింత ప్రమాదకరమైన రసాయనాలు, విషవాయువులు లేవు. కానీ ఇలాగే ప్రాణాంతకమైన వాయువులు, రసాయనాలున్నాయి. పొలోనియం, బొటూలినం, సారిన్‌, పొటాషియం సైనైడ్‌, హైడ్రోజన్‌ సైనైడ్‌, నాగుపాముల విషం ఈ కోవలోకి వస్తాయట. దీన్ని చూసుకొని కిమ్ విర్రవీగిపోతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీఎక్స్ రసాయనం కిమ్ వద్ద దాదాపు ఐదువేల టన్నులు ఉందని ఆరోపిస్తుంది దక్షిణ కొరియా. వీఎక్స్‌, సారిన్‌, మస్టర్డ్‌, హైడ్రోజన్‌ సైనైడ్‌ వంటి అతి ప్రమాదకరమైన 25 రకాల రసాయనాల నిల్వలు అక్కడున్నాయని చెబుతుంది. ఇలాంటి ప్రమాదకర ఆయుధాలు తయారు చేసేందుకు ఉత్తర కొరియాలో ప్రత్యేక ప్రయోగశాలలు కూడా ఉన్నాయంటోంది దక్షిణకొరియా. కాబట్టే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అమెరికాపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ - ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌

వీఎక్స్ తన దగ్గర ఉంది కాబట్టే కిమ్ రెచ్చిపోతున్నాడు. అందుకే అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటారు. ఒక్కోసారి ప్రకటనలకు పరిమితమైతే ఒక్కోసారి వ్యక్తిగత విమర్శల వరకు దారితీస్తుంది. మొన్న ఆ మధ్య ట్రంప్ ను దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ " ట్రంప్ ఒక ఓల్డ్ మ్యాన్ అని సెటైర్ వేశాడు" దీనికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బదులిస్తూ నేను నిన్ను ఎప్పుడైనా "బాగా కొవ్వుపట్టి లావుగా, పొట్టిగా ఉన్నావు" అని విమర్శించినా అని ట్రంప్ బదులిచ్చాడు.. అసలు నేను అలంటి వ్యాఖ్యలు చెయ్యను నా స్నేహితుడిని నేను ఆలా అనను.. ఒకవేళ ఎదోఒకరోజు ఆలా అంటానేమో అని కిమ్ జాంగ్ కు రివర్స్ పంచ్ వేశాడు ట్రంప్.ఇలా ఉంటుంది వారిద్దరి మధ్య మాటల యుద్ధం.

Next Story