ఆ పాటను మార్చే ప్రసక్తే లేదు

ఆ పాటను మార్చే ప్రసక్తే లేదు
x
Highlights

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మలయాళ చిత్రం 'ఒరు ఆధార్ లవ్' సినిమాలోని 'మాణిక్య మలయార పూవీ' పాట సాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే...

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మలయాళ చిత్రం 'ఒరు ఆధార్ లవ్' సినిమాలోని 'మాణిక్య మలయార పూవీ' పాట సాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని దర్శకుడు ఒమర్ లులూ తెలిపారు. ఈ పాటను సీఎమ్‌జే జప్పర్ రాశారని.. అందులో ఏ మతాన్ని కించపరిచే అభ్యంతర వ్యాఖ్యలు లేవని ఆయన అన్నారు. ఉత్తర కేరళలో జరిగే ప్రతి పెళ్లిలోనూ ఈ పాటను పాడుకుంటారని.. ఆ ప్రాంతంలోని ముస్లింలు కూడా 1978 నుంచి ఈ పాటను పాడుతూ వస్తున్నారని చెప్పారు. అప్పటి నుంచి అక్కడి ముస్లింలకు లేని అభ్యంతరం.. ఇప్పుడెందుకంటూ ఆయన ప్రశ్నించారు.

ఒకవేళ ఇందులో అంత అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే అది సెన్సార్ చూసుకుంటుందని.. కానీ ఈ పాటలోని సాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చనని స్పష్టం చేశారు. కావాలంటే మ్యూజిక్‌ను మాత్రమే మార్చగలమని చెప్పారు. అలాగే ఈ విషయంలో ప్రియా వారియర్‌కు ఎలాంటి సంబంధం లేదని.. దర్శకుడిగా తాను చెప్పినట్లుగా ఆమె చేసిందని తెలిపారు. అయితే ఈ పాట తమ మతస్థుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ హైదరాబాద్‌లో కొంతమంది ముస్లింలు ప్రియా వారియర్‌పై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.

Omar Lulu

Show Full Article
Print Article
Next Story
More Stories