అలాంటి ప్రయోగాలు మళ్లీ చేయను: మహేష్

అలాంటి ప్రయోగాలు మళ్లీ చేయను: మహేష్
x
Highlights

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల...

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం గురించి మహేశ్‌ బుధవారం విలేకరులతో మాట్లాడారు. కొత్తగా వచ్చే హీరోలు సైతం కమర్షియల్ సినిమాలను చేస్తుంటే.. సూపర్ స్టార్ అయ్యుండి కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక చిత్రాలే ఎక్కువగా చేశారు ప్రిన్స్ మహేశ్ బాబు. అలాంటి మ‌హేశ్ ఇక‌మీద‌ట‌ ప్రయోగాత్మ‌క సినిమాల జోలికి వెళ్ళ‌నని..పక్కా కమర్షియల్ సినిమాలనే చేస్తానని అంటున్నారు. ఇక భరత్ అనే నేను చిత్రం పూర్తిగా పొలిటికల్ డ్రామా కదా..మరి మీరు పొలిటీషియన్ గా ఎలా ప్రిపేర్ అయ్యారు..ఎలా మెప్పించారు అన్న ప్రశ్నకు..మహేష్ సమాధానం ఇచ్చారు.

‘దాదాపు సంవత్సరంన్నర క్రితం కొరటాల శివ ఈ కథ చెప్పినప్పుడు మొదట ఎగ్జైటింగ్‌గా అనిపించినప్పటికీ ఆ టైమ్‌లో భయం కూడా వేసింది. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నేను సంవత్సరంన్నర పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని చాలా విషయాలు నేర్చుకున్నా.. సినిమా చూసాక ప్రతీ నాయకుడు, ప్రతీ పొలిటికల్ పార్టీ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుందని భావిస్తున్నా’’ అని అన్నారు మహేష్. అంతే కాదు “దీనిపై పెద్దగా హోం వర్క్ అయితే చేయలేదు. దర్శకుడు కొరటాల శివ ఎలా చేయమని చెప్తే అలా చేశా. కొన్ని సన్నివేశాలకైతే బావ జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడే విధానాన్ని ప‌రిశీలించి చేశాన‌”ని చెప్పుకొచ్చారు మహేశ్.

Show Full Article
Print Article
Next Story
More Stories