Top
logo

లావణ్య పదవి ఊడింది!

లావణ్య పదవి ఊడింది!
X
Highlights

రెండు నెలలుగా అనేక మలుపులు తిరుగుతున్న భువనగిరి మున్సిపల్‌ రాజకీయానికి తెరపడింది. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ ...

రెండు నెలలుగా అనేక మలుపులు తిరుగుతున్న భువనగిరి మున్సిపల్‌ రాజకీయానికి తెరపడింది. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ అయిన భువనగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సుర్వి లావణ్య కోల్పోయింది. ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా మొత్తం 30 మంది సభ్యుల్లో ఆమెకు వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్‌లు ఓటేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తొలుత బీజేపీ నుంచి గెలిచిన లావణ్య అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 4 ఏళ్లు చైర్‌పర్సన్‌గా పాలన కొనసాగారు. అయితే ఇటీవల ఆమె అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎమ్మేల్యే పైల్ల శేఖర్‌ రెడ్డి ఆమె పదవి కోల్పోయేలా చేశారు. అవిశ్వాసం సందర్భంగా ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అక్రమంగా కౌన్సిలర్లు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ ధర్నా చేశారు.

Next Story