logo
జాతీయం

ఔరంగజేబు ఇంటికి నిర్మలా సీతారామన్..

ఔరంగజేబు ఇంటికి నిర్మలా సీతారామన్..
X
Highlights

కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన సైనికుడు ఔరంగజేబు కుటుంబాన్ని...

కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన సైనికుడు ఔరంగజేబు కుటుంబాన్ని పరామర్శించారు.. ఇవాళ ఉదయం జమ్మూ కశ్మీర్‌లో ఔరంగజేబు స్వస్థలమైన పూంఛ్ వెళ్లిన ఆమె.. అమర జవాను కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనీ... ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మలా సీతారామన్‌తో పాటు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

Next Story