logo
జాతీయం

మోదీని అంత మాట అంటావా? గల్లాపై మండిపడిన నిర్మలా సీతారామన్

మోదీని అంత మాట అంటావా? గల్లాపై మండిపడిన నిర్మలా సీతారామన్
X
Highlights

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రధాని మోడీ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు ...

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రధాని మోడీ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. రికార్డుల నుంచి జయదేవ్ వ్యాఖ్యలు తొలగించాలన్నారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ‘మోసగాడు’ అనే పదాన్ని ఉపయోగించారని, ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీలు సభలో ఆందోళన చేశారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానిని అలా అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Next Story