Top
logo

హైదరాబాద్ కు పాకిన నిపా వైరస్?

X
Highlights

కేరళ వాసులను వణికిస్తున్న నిఫా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....

కేరళ వాసులను వణికిస్తున్న నిఫా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులకు ఈ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను నిపా వైరస్ నిర్ధారణ కోసం పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా.. హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల కేరళకు వెళ్లొచ్చిన ఓ హైదరాబాదీ నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు.

Next Story