టాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో పడ్డ కేఎల్‌ రాహుల్‌

nanireddy
Updated on: 24 Dec 2018 1:35 PM IST
టాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో పడ్డ కేఎల్‌ రాహుల్‌
X

సినిమా హీరోయిన్లు, క్రికెటర్లు ప్రేమలో పడటం కొత్తేమి కాదు. ఐదుసంవత్సరాలుగా ఘాడమైన ప్రేమను కొనసాగించి గతేడాది ఒకటయ్యారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. తాజాగా మరో జంట కూడా ఒకటయ్యేట్టు కనిపిస్తోంది. టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌, హీరోయిన్ నిధి అగర్వాల్ కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనేందుకు ఓ ఫోటోనే ఉదహరణ. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జంటగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నట్టు వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై రాహుల్, నిధి లు ఎవరూ కూడా స్పందించలేదు. దీంతో వీరిమధ్య ఏదో జరుగుతున్నట్టు నెట్టింట కథనాలు అల్లేస్తున్నారు. కాగా నిధి అగర్వాల్ తెలుగులో నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు పలు బాలీవుడ్ చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

nanireddy

nanireddy

Next Story