Top
logo

మహిళల కోసం కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం..

మహిళల కోసం కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం..
X
Highlights

అమెరికాలో ఏర్పాటైన నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ (ఎన్‌డబ్ల్యూపీ)ని ఆదర్శంగా తీసుకుని అదే పేరుతో సామాజిక కార్యకర్త,...అమెరికాలో ఏర్పాటైన నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ (ఎన్‌డబ్ల్యూపీ)ని ఆదర్శంగా తీసుకుని అదే పేరుతో సామాజిక కార్యకర్త, వైద్యురాలు శ్వేతా శెట్టి(36) మంగళవారం ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో ఎన్‌డబ్ల్యూపీ పార్టీని ప్రారంభించారు. ఎన్‌డబ్ల్యూపీ పార్టీ ప్రారంభోత్సవంలో యాసిడ్ దాడి బాధితురాలు రీతూ, డొమెస్టిక్ వాయిలెన్స్ బాధితురాలు పూజ‌లు కూడా లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం మహిళా అభ్యర్థులే పోటీ చేసేలా పోరాడడమే ఎన్‌డబ్ల్యూపీ పార్టీ ప్రధాన ఉద్దేశమని శ్వేత వెల్లడించారు. ప్రస్తుతం పార్లమెంటు మొత్తం బలం 11 శాతం ఉందని తెలంగాణ మహిళల సమితితో పాటు దేశవ్యాప్తంగా 1.45 లక్షల మహిళల మద్దతును ఎన్‌డబ్ల్యూపీ పార్టీ కోరుకుంటుందని శ్వేత పేర్కొంది. ముఖ్యంగా పార్టీ యొక్క ఉద్దేశ్యం పార్లమెంటు మహిళలకు రిజర్వేషన్లు సాధించడం, కార్యాలయాల్లో మహిళలు ఎదుర్కుంటున్న వేధింపులను నిరోధించడం వంటి వాటిపై పోరాడతామని శ్వేతా శెట్టి చెప్పారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికల గురించి ఇంకా శ్వేతా శెట్టి వివరించలేదు.

Next Story