Top
logo

ప్రణయ్ మర్డర్ కేసులో నయీం పాత గ్యాంగ్ హస్తం

ప్రణయ్ మర్డర్ కేసులో నయీం పాత గ్యాంగ్ హస్తం
X
Highlights

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణయ్ హత్యకు అమృత తండ్రి...

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణయ్ హత్యకు అమృత తండ్రి తిరునగరు మారుతిరావు, సోదరుడు శ్రవణ్ సూత్రదారులుగా గుర్తించారు. హత్యకేసు నిందితులను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక ప్రణయ్ ను మారుతిరావే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితులు మారుతీరావు, తిరునగరు శ్రవణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ మర్డర్ కేసులో నయీం పాత గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రణయ్ ను చంపిన హంతకుడు హిందీలో మాట్లాడారని నెల రోజులుగా మిర్యాలగూడలోనే మకాం వేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గతంలోనూ మిర్యాలగూడలో పలు భూ సెటిల్మెంట్ దందాల్లో పాల్గొన్న నయీం పాత గ్యాంగ్ ను అమృత తండ్రి మారుతీరావు వాడుకున్నట్లు తెలుస్తోంది. పాత కేసులతో పాటు మొబైల్ డెటాను పరిశీలిస్తున్న పోలీసులు హంతకుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Next Story