కాబోయే భర్త అంటూ అనౌన్స్ చేసేసింది

లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. నాన్‌మ్ రౌడీ...
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. నాన్‌మ్ రౌడీ ధాన్(తెలుగులో నేనూ రౌడీనే)చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్ టాపిక్‌గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం.. వాటిని నయనతార ఖండించటం చూశాం. ఆ సమయంలో విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె ప్రకటించారు. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్‌షిప్ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి.
కాగా తన ప్రేమ గురించి నయన్ తొలిసారి ఓ వేదికపై మాట్లాడారు. విఘ్నేశ్ తనకు కాబోయే భర్తని చెప్పకనే చెప్పారు. చెన్నైలో ఓ మీడియా సంస్థ అవార్డుల వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నయన్ హాజరయ్యారు. ‘ఎక్సలెన్స్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్’ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆమె వేదికపై ప్రసంగిస్తూ.. ‘నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లి, తండ్రి, సోదరుడికి, నాకు కాబోయే భర్త(విఘ్నేశ్‌ను ప్రస్తావిస్తూ)కు ధన్యవాదాలు. ఇప్పటి వరకు నేను పాల్గొన్న అవార్డుల కార్యక్రమానికి, ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంది. ఇక్కడ నా చుట్టూ ఉన్న మహిళలు సాధించిన విజయం నాలో మరింత స్ఫూర్తిని నింపింది’ అని చెప్పి ప్రేమపై ఓ స్పష్టత ఇచ్చారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT