logo
జాతీయం

ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు.. తన హత్యకు ఆయనే కుట్ర పన్నారని ఆరోపణ

Highlights

ప్రధాని మోడీ హత్యకు కుట్ర జరిగిందా..? మోడీని అడ్డుతొలగించుకోవడనికి యత్నించింది ఎవరు..? ఆ కుట్ర ఎవరు చేశారు..?...

ప్రధాని మోడీ హత్యకు కుట్ర జరిగిందా..? మోడీని అడ్డుతొలగించుకోవడనికి యత్నించింది ఎవరు..? ఆ కుట్ర ఎవరు చేశారు..? ఎక్కడ చేశారు...? హత్య విషయంలో ప్రధాని మోడీ చేసిన సంచలన ఆరోపణ ఏంటి..?

మోడీని "నీచ్" అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మాజీ నేత మణిశంకర్ అయ్యర్‌‌ను ప్రధాని గుజరాత్‌లో మరోసారి టార్గెట్ చేశారు. రెండోదశ ఎన్నికలు జరుగుతున్న భాభర్‌‌లో నిన్న ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. సంచలన ఆరోపణలు చేశారు. అయ్యర్ పాకిస్థాన్ వెళ్ళి, తన తలకు వెల కట్టారని ఆరోపించారు. ఇప్పుడు మోడీ వచ్చారు. ఆయనను అడ్డు తొలగించుకోకపోతే భారత్-పాకిస్థాన్ సంబంధాలు బాగుండవని పాకిస్థాన్‌ వేదికగా జరిగిన చర్చల్లో అయ్యర్ ప్రతిపాదించారని ప్రధాని చెప్పారు. పాకిస్థాన్‌లో ఎవరితో ఏం మాట్లాడారో అంతా సోషల్ మీడియాలో వచ్చిందని మోడీ గుర్తు చేశారు.

మణిశంకర్ అయ్యర్ అసలు పాకిస్థాన్ ఎందుకు వెళ్లారు పొరుగు దేశం వెళ్ళినవారు మోడీని అడ్డు తొలగించుకోవడం గురించి ఎందుకు మాట్లాడారని ప్రధాని ప్రశ్నించారు. మోడీ కోసం సుపారీ ఇవ్వడానికి పాకిస్థాన్ వెళ్ళారా? అని నిలదీశారు. అసలు అడ్డు తొలగించడమంటే అర్థం ఏంటి నేను చేసిన తప్పేంటి అని మోడీ అడిగారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తనకు ఏమీ కాదని మోడీ అన్నారు. నాకు ఏమీ జరగదు నాతోపాటు గుజరాత్ ప్రజలు ఉన్నారు, నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది’’ అని మోడీ చెప్పారు.

Next Story