Top
logo

రాహుల్‌తో భేటీకి హాజరైన నారా బ్రాహ్మణి

X
Highlights

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 245...

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 245 మంది ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించగా..దాదాపు వంద మందికి పైగా హాజరయ్యారు. హెరిటేజ్ గ్రూప్‌కు చెందిన నారా బ్రాహ్మణి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, యువ పారిశ్రామిక వేత్తలు టీజీ భరత్, జేసీ పవన్ హాజరయ్యారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న GST , నోట్లరద్దు తదనంతర పరిణామాలపై రాహుల్ చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర విభజర తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ది కోసం తీసుకున్న చర్యలు గురించి ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో పారిశ్రామిక, సేవారంగాల అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకుంటే దేశం అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తున్నాయని అంశాలపై రాహుల్ పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తున్నారు.

Next Story