logo
సినిమా

బిగ్‌బాస్‌2లో తారక్...

బిగ్‌బాస్‌2లో తారక్...
X
Highlights

బిగ్ బాస్ రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా ఈ కార్య‌క్ర‌మం 100 రోజులు.. 16 మంది...

బిగ్ బాస్ రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా ఈ కార్య‌క్ర‌మం 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్ లో జ‌ర‌గ‌నుంది. ఫస్ట్ సీజన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీజన్ ను ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. త్వరలో ఈ షో గురించి పూర్తి వివరాలు తెలియబోతున్నాయి. బిగ్ బాస్ 2'పై ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారో లేదో పలువురు సినీ తారలు ఈ ప్రోగ్రామ్ లో పాల్గోనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 10 నుంచి ప్రారంభమయ్యే 'బిగ్ బాస్ 2' షోలో పాల్గొనబోయేది వీరే అంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నందమూరి ఫామిలీ నుంచి ఒక హీరో బిగ్‌బాస్2‌కి సెలెక్ట్ అయ్యాడన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒకేసారి ఏకంగా 9 డెబ్యూ మూవీస్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన నందమూరి తారకరత్న.. బిగ్‌బాస్ ద్వారా తన ఫేమ్‌ని మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోగా సక్సెస్ కాలేక.. అడపాదడపా విలన్ క్యారెక్టర్లను కూడా ట్రై చేస్తున్న తారక్.. బిగ్‌బాస్ ద్వారా ‘బ్రేక్’ దొరుకుతుందని ఆశిస్తున్నాట్ట!

Next Story