బురఖా వేసుకుంటే తప్పకుండా తనిఖీ చేయాలి: ఫిరోజ్ ఖాన్

బురఖా వేసుకుంటే తప్పకుండా తనిఖీ చేయాలి: ఫిరోజ్ ఖాన్
x
Highlights

హైదరాబాద్‌లోని పోలింగ్‌ కేంద్రాల్లో గత ఎన్నికల్లో బురుక ధరించి దొంగ ఓట్లు వేస్తున్నారని దొంగ ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్...

హైదరాబాద్‌లోని పోలింగ్‌ కేంద్రాల్లో గత ఎన్నికల్లో బురుక ధరించి దొంగ ఓట్లు వేస్తున్నారని దొంగ ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. పోలింగ్ బుత్‌ల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ కెమెరాలు ఏర్పాటు చేయాలని పిటిషన‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్ట్, పిటిషనర్ సూచించిన అంశాలుపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కి ఆదేశించింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో బురకల్లో వచ్చి దొంగ ఓట్లు వేసేవారని పిటిషన్ లో తెలిపారు.

ఇక పోలింగ్ కేంద్రాలకు మగవారు కూడా బురకలో వచ్చి, ఓట్లు వేసే అవకాశం ఉందని వాటిపై చర్యలు తీసుకోవాలి కోరారు. బురకాలో వచ్చిన వారిని గుర్తించి, వారి ఓటర్ లిస్టు చెక్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పిటిషన లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, ఆర్మడ్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల్లో ఉంచాలి. ఓటు వేసే ప్రతి వ్యక్తిని కూడా ఫోటో ను తీసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ కోరారు.

ఫిరోజ్ ఖాన్ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఈసిని ప్రశ్నించింది. దీంతో ఎన్నికలకమిషన్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ పిటిషనర్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని అమలు చేస్తామని కోర్ట్ కి తెలిపారు. తనకి భద్రత కలిపించాలని కూడా ఆయన పిటిషన్ పేర్కొన్నారు. గతంలో తనపై హత్యయత్నం జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్ పై స్పందించన కోర్టు ఫిరోజ్ ఖాన్ కి భద్రతకి కలిపించాలని డీజీపీ కి ఆదేశించింది. సెక్యురిటీ కావాల్సివస్తే, డీజీపీకి లెటర్ రాయవచ్చని తెలిపింది. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories