నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ప్రైవేట్ వైద్యుడి అరాచకం

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ప్రైవేట్ వైద్యుడి అరాచకం
x
Highlights

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి ఆరాచకం...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన అనిత గర్బ సంచి...

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి ఆరాచకం...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన అనిత గర్బ సంచి సమస్యతో....తారాసింగ్‌ అనే వైద్యున్ని సంప్రదించింది. గర్బసంచిలో గడ్డ ఏర్పడిందన్న తారాసింగ్‌...ఆపరేషన్ చేయాలని అనితకు చెప్పడంతో ఆమె అంగీకరించింది. ఆపరేషన్‌ చేయించుకునేందుకు బాధితురాలు అనిత...డీబీఎం ఆస్పత్రిలో చేరింది. క్లినిక్‌లో ఉదయం ఆపరేషన్ ప్రారంభించిన డాక్టర్ తారాసింగ్...కొంతసేపటికే ప్లేట్‌ పిరాయించాడు. కడుపులో గడ్డను తొలగించడం సాధ్యం కాదంటూ...ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి తిరిగి కుట్లు వేశాడు. డాక్టర్‌ వైఖరికి నిరసనగా...బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ఆపరేషన్‌ను మధ్యలోనే వదిలేసిన డాక్టర్ తారాసింగ్‌...ఉప్పునుంతల మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ విధులకు ఎగనామం పెట్టి...సొంత క్లినిక్‌లో పని చేస్తున్నాడు. అయితే వైద్యుడు తారాసింగ్‌పై గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయ్. డీఎంహెచ్‌వోకు సమీప బంధువు కావడంతో....ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించకుండా తిరుగుతున్నాడన్న విమర్శలు ఉన్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories