టీఆర్ఎస్ పార్టీకే నా ఓటు: పోసాని కృష్ణమురళి

టీఆర్ఎస్ పార్టీకే నా ఓటు: పోసాని కృష్ణమురళి
x
Highlights

ప్రత్యేక రాష్ర్టం కలలు సాకారం కావాలంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...

ప్రత్యేక రాష్ర్టం కలలు సాకారం కావాలంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. ఇవాళ ఉదయం పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఉత్తమమైన పాలన అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు చంద్రబాబును నమ్మొద్దన్నారు. బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని వ్యాఖ్యానించారు. దేశంలో చంద్రబాబు లాంటి మోసగాడు మరొకరు లేరని అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం నిజాలు చెప్పరని....నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చంద్రబాబుకు శాపం ఉందని పోసాని తెలిపారు. తాను టీఆర్ఎస్‌ పార్టీకే ఓటేస్తానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories