నోటాకే నా ఓటు..: క్యాబ్ డ్రైవర్లు వినూత్న ప్రచారం

నోటాకే నా ఓటు..: క్యాబ్ డ్రైవర్లు వినూత్న ప్రచారం
x
Highlights

తెలంగాణా లో రాజకీయ పార్టీలు ప్రచారం జోరు , హోరు కొనసాగుతున్న నేపధ్యం లో నోటాకే నా ఓటు నోటాకే నా ఓటు అనే ప్రచారం ఉపందుకుంది. అసలు ఈ కొత్త ప్రచారం...

తెలంగాణా లో రాజకీయ పార్టీలు ప్రచారం జోరు , హోరు కొనసాగుతున్న నేపధ్యం లో నోటాకే నా ఓటు నోటాకే నా ఓటు అనే ప్రచారం ఉపందుకుంది. అసలు ఈ కొత్త ప్రచారం ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన వినూత్న ప్రచారం ఇది. తమ సమస్యలు పట్టించుకోని పార్టీలకు ఓటు వేసేది లేదని తెగేసి చెపుతున్నారు. నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలు పరిష్కారం చూపకుండా ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే తామెందుకు వేస్తామంటూ నోటాకే నా ఓటు అంటూ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లు సమస్యలు పరిష్కారం కోసం నాలుగున్నరేల్లగా పోరాటం చేస్తున్న ఇటు ప్రభుత్వం కాని , రాజకీయ పార్టీలు తమ గోడును పట్టించుకొన్న పాపాన పోలేదని ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బుద్ది చెప్పడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. నోటాకే నా ఓటు అనే నినాదం తో ప్రచారం చేస్తున్నామా అంటున్నారు తెలంగాణా డైవర్స్ అండ్ ఓనర్స్ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఓలా ,ఉబెర్ కంపనీలు వచ్చిన కొత్తలో ఆకర్షినియమైన పెమెంట్లు , ఇన్సెంటివ్ లు పేరుతో తమని మభ్య పెట్టి కంపనీలు మోసం చేస్తునాయని తెలిపారు.

నాలుగున్నర ఏళ్లగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమం చేస్తున్న ఇటు ప్రభుత్వం కాని , అటు రాజకీయ పార్టీలు కాని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు వినూత్నంగా నోటాకే నా ఓటు అనే నినాదాన్ని ప్రచారం లోకి తెచ్చారు. నగరం లో లక్ష ఇరవై ఐదు వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని , కుటుంబం కి సగటున నాలుగు ఓట్లు వేసుకున్న ఐదు లక్షలు ఓట్లు ఆ ఓట్లు మొత్తం నోటా కే ఓటు వేసే విధంగా తీర్మానం చేశారు. రాజకీయ పార్టీలు పై అసంతృప్తి తో ఉన్న ఓటు హక్కు ను వినియోగించుకుంటామని , ఎన్నికల ప్రక్రియ లో పాల్గొంటామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను తిరస్కరిస్తూ నోటాకు ఓటు వేస్తామని తెగేసి చెపుతున్నారు. డిసెంబర్ 7 న తప్పని సరిగా ఓటు వేసి తీరాలని , కుటుంబ సభ్యులు అందరితో ఓటు వేసి ,నోటా ను బలపరచాలని తీర్మానం చేశారు.

ప్రస్తుతం ఓలా , ఉబార్ కంపనీలు ఇన్సెంటివ్స్ పెంచాలి ,ప్రభుత్వమే ఓలా , ఉబర్ క్యాబ్ లు లాంటి వి ప్రరంబించాలి , కిలో మీటర్ కి 11 రూపాయలు నుండి 17రూపాయలకి పెంచాలని డిమాండ్ చేశారు . ఉద్యోగ భద్రత కల్పించాలి , వెల్ఫైర్ బోర్డు ఏర్పాటు చేయాలి , గుర్తింపు కార్డ్ , ఆరోగ్య భద్రత , ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక నోటా కే ఓటు అంటూ తమ నిర్ణయాన్ని పబ్లిక్ తెలిపేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు క్యాబ్ లు పై నా ఓటు నోటాకే మీరు కూడా నోటా కే ఓటు వేసి బలపరచాలని ప్రయాణికులును కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories