మిస్టరీగా మారిన సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య కేసు

x
Highlights

వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినీల్ అలియాస్ నాని ఆత్మ హత్య కేసు మిస్టరీగా మారింది . ఆశించిన దాని కంటే ఎక్కువ గుర్తింపు .... చేతినిండా సినిమాలున్నా...

వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినీల్ అలియాస్ నాని ఆత్మ హత్య కేసు మిస్టరీగా మారింది . ఆశించిన దాని కంటే ఎక్కువ గుర్తింపు .... చేతినిండా సినిమాలున్నా అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడటంపై అంతుచిక్కడం లేదు. పలు కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న ఏ ఒక్క ఆధారం లభించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల ఏడో తేదిన ఓ పోలిస్ అధికారి కుమారుడు తో అనురాగ్ బయటికి వెళ్లి వచ్చిన తరువాత ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అనురాగ్ కుటుంబం గత కొన్నేళ్ళుగా నాగోల్ లోని మమత నగర్ లో నివాసం ఉంటోంది. రెండు నెలల క్రితం మర్రి పల్లిలో మరో ఇంటిని కొనుగోలు చేసిన అనురాగ్ అప్పుడప్పుడు వెళ్లి వస్తుండే వాడు. ఈ నెల ఏడో తేదిన తన స్నేహితుడైన ఓ పోలీస్ ఉన్నతాధికారి కుమారుడిచ్చిన పార్టీలో పాల్గొన్నాడు. ఈ వేడకకు హాజరైన అనురాగ్ లేట్ నైట్ అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఇంటికి రావాలంటూ కోరారు. దీంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన అనురాగ్‌ మద్యం మత్తులో ఉండటం చూసి కుటుంబ సభ్యులు మందలించారు. తరువాత యధావిదిగా తన గదిలో పడుకున్న అనురాగ్ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనురాగ్ సోదరుడు చివరి నిమిషంలో గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లినా ..అప్పటికే పరిస్ధితి చేయిదాటిపోయింది.

నిత్యం ఆడుతూ,పాడుతూ ఉండే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేతి నిండా ఆఫర్స్ ఉన్నాయని , రెండు నెలలు నుండి వర్క్ లో చాలా బిజీ బిజీగా ఉండేవాడని చెబుతున్నారు. అనురాగ్ మానసిక పరిస్దితిపై వస్తున్న వార్తలు అన్నీ రూరమ్సేనని తల్లి స్పష్టం చేశారు.

కుటుంబ సభ్యులు తనను మందలించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వినిపిస్తూ ఉండటంతో పోలీసులు ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. ఎలాంటి సూసైడ్ లేకపోవడం, మరణించిన సమయంలో మద్యం సేవించి ఉండటంతో పోలీసులకు విచారణ కష్టసాధ్యంగా మారింది. ఇప్పటికే కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు, వాట్సప్‌, ఇతర చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడయ్యే అంశాలను బట్టి తదుపరి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories