అమ్మకు ఆఖరి సందేశం

అమ్మకు ఆఖరి సందేశం
x
Highlights

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడి నుంచి తప్పించుకొన్న దూరదర్శన్‌ లైట్‌ అసిస్టెంట్‌ శర్మ ఘటనా స్థలంలో ఒక వీడియో రికార్డు చేశాడు. తాను...

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడి నుంచి తప్పించుకొన్న దూరదర్శన్‌ లైట్‌ అసిస్టెంట్‌ శర్మ ఘటనా స్థలంలో ఒక వీడియో రికార్డు చేశాడు. తాను కూడా చనిపోతానని భావించి తల్లికి వీడ్కోలు చెబుతూ ఓ వీడియో రికార్డు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఆ వీడియో అందరి గుండెలు పిండేస్తోంది.

అమ్మా, ఐ లవ్ యూ.. నేను ఇవాళ చనిపోతానేమో.. కానీ చావు ముందు నిలబడినా నాకెందుకో కొంచెం కూడా భయం లేదు దంతేవాడలో నక్సల్స్ మెరుపుదాడికి దిగినప్పుడు దూరదర్శన్ ఉద్యోగి మొర్ముకుట్ శర్మ పలికిన మాటలివి. మావోయిస్టులు చుట్టుముట్టి తూటాలు పేల్చుతుండగా ఆయన తన మొబైల్ ఫోన్‌లో తీసుకున్న ఈ వీడియో గుండెలు పిండేసేలా ఉంది.

దూరదర్శన్ సిబ్బందిపై దాడి మొదలైన కొద్ది క్షణాలకు ఇక తాము చనిపోతామని భావించిన లైట్ అసిస్టెంట్ శర్మ నెమ్మదిగా ఫోన్ తీసుకుని తన తల్లి కోసం ఓ సందేశాన్ని రికార్డు చేశారు. ఆయన చెట్ల మధ్య నేలపై పడుకుని కెమేరా వైపు చూస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. వెనుక పెద్ద ఎత్తున తూటాల శబ్ధం కూడా వినిపిస్తోంది. ఇదే దాడిలో శర్మతో పాటు కెమేరామేన్ అచ్యుతానంద సాహు, ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

తల్లికి వీడియో కాల్ చేసిన మొర్ముకుట్ శర్మ తమపై దాడి జరిగిన విషయాన్ని తెలిపాడు. ఎన్నికల కవరేజీ కోసం నేను దంతేవాడ వచ్చాను. మేము రోడ్డు మార్గంలో వెళ్తున్నాం. మాతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా నక్సలైట్లు మమ్మల్ని చుట్టుముట్టారు. అమ్మా, ఐ లవ్ యూ ఈ దాడిలో నేను చనిపోతానేమో అంటూ ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. అయితే, చావంటే తనకు భయం లేదని తెలిపాడు. ఎందుకో తెలియదు. మృత్యువు ముందున్నా నాకు భయంగా లేదు. నేను బయటపడేలా కనిపించడం లేదు. మాకు రక్షణగా కొంతమంది జవాన్లు ఉన్నప్పటికీ నక్సలైట్లు అన్ని దిక్కుల నుండి మమ్మల్ని చుట్టుముట్టారు. ప్రస్తుతానికి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అంటూ శర్మ తన సందేశాన్ని ముగించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి శర్మ వీడియో చూస్తే ఆయన నిబద్ధత, కన్నతల్లిపై ఉన్న ప్రేమ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎదురుగా మృత్యువు ఉన్నా తనకు భయం లేదంటూ చెబుతున్న మాటలు ఆయనలోని ధైర్యాన్ని చాటిచెప్పాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories