logo
జాతీయం

ముంబై లోకల్ ట్రైన్ డోర్ లో చిక్కుకున్న మహిళ చీర

ముంబై లోకల్ ట్రైన్ డోర్ లో చిక్కుకున్న మహిళ చీర
X
Highlights

ఓ మహిళ చీర రైలులో చిక్కుకొని గాయపడిన ఘటన ముంబై లోకల్ ట్రైన్ లో జరిగింది. ముంబైలోని కంజుమార్గ్ రైల్వే స్టేషన్...

ఓ మహిళ చీర రైలులో చిక్కుకొని గాయపడిన ఘటన ముంబై లోకల్ ట్రైన్ లో జరిగింది. ముంబైలోని కంజుమార్గ్ రైల్వే స్టేషన్ లో నెమ్మదిగా కదులుతున్న రైలు నుంచి దిగుతున్న ఓ మహిళ చీర డోర్ లో చిక్కుకుపోయింది. వెంటనే మహిళ కింద పడిపోయింది. రైలు నెమ్మదిగా వేగం అందుకోవడంతో ఆమెను లాక్కెళ్లింది. ఈసమయంలో అక్కడే ఫ్లాట్ ఫాంపై ఉన్న ఓ రైల్వే పోలీసు ఆమెను రక్షించడంతో పెద్ద ప్రమాదం నుంచి బయట పడింది.

రైలులో చీర చిక్కుకొన మహిళ కిందపడిపోగానే అది గమనించి రైల్వే పోలీస్ ఆమెను బలంగా లాగే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో రైలు కదులుతుండటంతో పోలీసు కూడా కిందపడిపోయాడు. అయితే పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆమెను రైలు నుంచి గట్టిగా లాగడంతో ప్రమాదం నుంచి బయటపడింది. అయితే రైలు బలంగా ఈడ్చుకెళ్లడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. ఆమెన ఆసుపత్రికి తరలించారు. కిందపడిపోయిన మహిళ రైల్వే ఉద్యోగని సమాచారం.

Next Story