జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన ఎంపీ కవిత

జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన ఎంపీ కవిత
x
Highlights

నిజామాబాద్‌ ఎంపీ కవిత జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎవరో దాదాపు చెప్పేశారు. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అభ్యర్ధిని ప్రకటించేశారు. జగిత్యాలకు...

నిజామాబాద్‌ ఎంపీ కవిత జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎవరో దాదాపు చెప్పేశారు. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అభ్యర్ధిని ప్రకటించేశారు. జగిత్యాలకు కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ అంటూ కవిత అనౌన్స్ చేశారు. ప్రజలు ఆయనకు అండగా నిలవాలని కోరారు. కాబోయే ఎమ్మెల్యే సంజయ్ అంటూ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఇక ఎప్పటిలాగానే కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డ కవిత గొర్రెల పంపిణీని ఎగతాళి చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తలసాని ఫైర్ అయ్యారు. ఆయనవి గాలి మాటలేనని విమర్శించారు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జగిత్యాలకు ఏం చేశారని ప్రశ్నించారు. సూటుకేసు దొంగలా.. టీఆర్ఎస్‌ను విమర్శించేది అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories