Top
logo

బిడ్డను బలి తీసుకున్న తల్లిపాలు

బిడ్డను బలి తీసుకున్న తల్లిపాలు
X
Highlights

తను ఆప్యాయంగా ఇస్తున్న చనుబాలే తన బిడ్డ పాలిట కాలకూట విషంగా మారుతున్నాయని ఊహించలేకపోయింది ఆ తల్లి....

తను ఆప్యాయంగా ఇస్తున్న చనుబాలే తన బిడ్డ పాలిట కాలకూట విషంగా మారుతున్నాయని ఊహించలేకపోయింది ఆ తల్లి. అమృతతుల్యమైన ఆ పాలే తన బిడ్డను మృత్యు ఒడికి చేరుస్తుందని గ్రహించలేకపోయింది. తెలిసో తెలియకో ఆ తల్లి చేసిన పొరపాట్లే ఆమె బిడ్డకు మృత్యుశాసనాన్ని రచించాయి ఈ లోకం నుంచి ఆ పసికందును శాశ్వతంగా దూరం చేయగా తల్లిని జైలుపాలు చేసేలా ఉంది.

బిడ్డకు సంజీవని ప్రతిరూపమైన తల్లిపాలు ముక్కుపచ్చలారని చిన్నారిని బలితీసుకుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఏప్రిల్‌ 2న జరిగిన ఈ ఘటన యావత్‌ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. కన్నబిడ్డను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెపై హత్యనేరంతో కటకటపాలు చేస్తుందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

పెన్సిల్వేనియాకు చెందిన సమంత జోన్స్‌ తన 11నెలల బాబు ఆకలితో గుక్కపెట్టి ఏడవడంతో అందరి తల్లుల్లాగే ఆమె కూడా పాలు పట్టించింది. తర్వాత ఆమె నిద్రలోకి జారుకుంది. ఉదయం లేచి చూసేసరికి బాలుడి నోటి నుంచి నురగ, రక్తం వస్తూ ఉలుకూ పలుకూ లేకుండా పడిఉన్నాడు. దీంతో కంగారు పడ్డ సమంత దంపతులు వెంటనే బాబును ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాబును పరీక్షించిన వైద్యులు చెప్పిన మాట విని షాక్‌కు గురయ్యారు. బిడ్డ చనిపోయాడని తెలియజేయడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అసలే దుంఖంలో ఉన్న వారికి మరో చేదు నిజాన్నివైద్యులు చెప్పడంతో అవాక్కయ్యారు.

శిశువు రక్తంలో నొప్పి నివారణకు వాడే మెథడోన్‌, మనో వైకల్యానికి వాడే యాంఫిటామైన్‌, మెథాఫెటమైన్‌ ఔషధ మూలాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. తల్లి వేసుకున్న ఈ మందులే పాలను విషంగా మార్చాయని చెప్పారు. బిడ్డ ప్రాణం పోవడానికి తల్లిరొమ్ముపాలే కారణమని తెలుసుకున్న పోలీసులు ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత 3 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుపై సమంత బెయిల్‌పై రిలీజ్‌ అయ్యారు.

ఈ కేసులో గత శుక్రవారం వాదనలు మొదలుకాగా, మెథడోన్‌తో కూడిన మందులను ఆమె తీసుకోవటమే చిన్నారి మరణానికి కారణమైందని ప్రాసిక్యూషన్‌ వాదించారు. అయితే మెథడోన్‌ మందులు వాడి బిడ్డకు పాలివ్వొచ్చన్న శాస్త్రవేత్తల వాదనను సమంత తరపు అటార్నీ వాదించారు. కాగా, ఈ కేసులో తదుపరి వాదనను జూలై 23కి వాయిదా వేశారు. కోర్టు దోషిగా ప్రకటిస్తే మాత్రం ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

Next Story