logo
వ్యాపారం

మార్కెట్లో రూ.350..క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

Highlights

దేశంలో బ్లాక్ మనీని అరికట్టేందుకు పీఎం మోడీ, ఆర్బీఐ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే...

దేశంలో బ్లాక్ మనీని అరికట్టేందుకు పీఎం మోడీ, ఆర్బీఐ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పెద్దనోట్ల రద్దుతో ఆర్బీఐ కొత్తనోట్లు విడుదల చేసిందనే వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో పది రూపాయల నాణేల విషయం లో ఇదే జరిగింది. ఆర్బీఐ రూ.10నోట్లను విడుదల చేసిందని ..కొంతమంది కేటుగాళ్లు డమ్మీ రూ.10 రూపాయాల్ని విడుదల చేశారు. దీంతో ఏది ఒరిజనలో..ఏది డమ్మీనో తెలుసుకోలేక నానా అగచాట్లు పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్బీఐ తాము విడుదల చేస్తున్న రూ.10 నాణెం పై క్లారిటీ ఇచ్చారు. డబ్బులు తీసుకునే విషయంలో, ఇచ్చే విషయంలో జాగ్రత్తపడాలి సూచించింది.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ రూ.350 నోట్లను విడుదల చేసిందంటూ సొోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు రూ.350 నోటు రూ.350 నోటు ఇమేజ్‌... వైల్డ్‌ రెడ్‌ కలర్‌లో ఉండబోతుందంటూ మార్ఫింగ్‌ చేసిన ఫోటోల్ని పోస్ట్ చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకడంతో ఆర్బీఐ మరోసారి రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్నది అంతా అబద్దం అని.. ఎవరూ నమ్మొద్దని వెల్లడించింది. రూ.350 నోటు విడుదల చేసే ఆలోచన, ఉద్దేశం లేదని వెల్లడించింది.

Next Story