నిర్లక్ష్యానికి పరాకాష్ట: RTC డ్రైవర్ కోతితో బస్సు నడిపించాడు

x
Highlights

కొందరు బస్సు డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాల్సిన బాధ్యతను విస్మరించి వారి ప్రాణాలకు...

కొందరు బస్సు డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాల్సిన బాధ్యతను విస్మరించి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఓ బస్సు డ్రైవర్‌ ఏకంగా కోతి చేతికి స్టీరింగ్‌ ఇచ్చి దాని వేషాలను చూస్తూ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో కర్ణాటక ప్రభుత్వం సదరు బస్‌ డ్రైవర్‌ని విధుల నుంచి తొలగించింది. ఈ నెల 1న దావణగెరె నుంచి బ్రహ్మసాగర వెళ్తున్న బస్సులోకి ఓ ఉపాధ్యాయుడితో పాటు కోతి ఎక్కింది. రోజూ చూసే కోతి కావడంతో డ్రైవర్ ప్రకాష్ దానిని ఒడిలో కూర్చోపెట్టుకొని స్టీరింగ్ అప్పజెప్పాడు. భయాందోళనలకు గురైన ప్రయాణికులు అభ్యంతరం చెప్పినా వినిపించుకోలేదు. ఓ చేత్తో కోతిని నిమరడం మరోచేత్తో స్టీరింగ్ పట్టుకొని నవ్వుతూ కూర్చొన్నాడు. దీంతో ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని వీడియో తీశాడు. వీడియోలో కోతి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఆ బస్సు డ్రైవర్‌ని సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories