logo
సినిమా

ఎన్టీఆర్‌కు సవాల్‌ విసిరిన మోహన్‌లాల్ ‌!

ఎన్టీఆర్‌కు సవాల్‌ విసిరిన మోహన్‌లాల్ ‌!
X
Highlights

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్యకు సవాలు విసిరారు. ఇటీవల కేంద్రమంత్రి రాజ్యవర్థన్...

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్యకు సవాలు విసిరారు. ఇటీవల కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ పేరుతో హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో వారు కూడా ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు కూడా ఈ సవాల్‌ను స్వీకరించి ఎక్సర్‌సైజ్‌లు చేసి తమ సన్నిహితులకు సవాలు విసిరారు. తాజాగా మోహన్ లాల్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తాను రాథోడ్ ఫిట్‌నెస్ సవాలును స్వీకరించానని.. తారక్, సూర్య, పృథ్వీరాజ్‌లను కూడా ఈ ఛాలెంజ్‌కు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ ఛాలెంజ్‌ను తారక్, పృధ్వీ, సూర్య ఎలా స్వీకరిస్తారో చూడాలి.

Next Story