అజారుద్దీన్‌కు కీలక బాధ్యతలు

అజారుద్దీన్‌కు కీలక బాధ్యతలు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరిన వారికి కీలక పదవులనే అప్పగిస్తోంది కాంగ్రెస్. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సీని నిర్మాత...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరిన వారికి కీలక పదవులనే అప్పగిస్తోంది కాంగ్రెస్. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సీని నిర్మాత బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పిగించిన విషయం తెలిసిందే అయితే ఇలాంటి సెలెబ్రెటి అయిన టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది. కాగా ఈ మేరకు నేటి పగలు ఉత్తర్వులు జారీచేసింది. అజారుద్దీన్ తో పాటు బీఎం వినోద్ కుమార్, జాఫర్ జావేద్ లను ఉపాధ్యక్షులుగా నియమించింది. చాలా కాలంగా పార్టీకి సేవలు అందించిన నన్ను ఎప్పుడు పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తనకు సికింద్రాబాద్ నుంచి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని వెల్లడించారు. అజర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ చెప్పారు

Show Full Article
Print Article
Next Story
More Stories