logo
జాతీయం

మోడీ రాముడైతే.. యోగి హనుమంతుడట... సురేంద్ర మాటలివి!!

మోడీ రాముడైతే.. యోగి హనుమంతుడట... సురేంద్ర మాటలివి!!
X
Highlights

దేవుళ్లను పూజించేందుకు దేశాలు తిరుగుతున్న ప్రధాని మోడీని.. ఏకంగా దేవుడినే చేసేశారు. ఆయన కలియుగ రాముడని.. ఆయన...

దేవుళ్లను పూజించేందుకు దేశాలు తిరుగుతున్న ప్రధాని మోడీని.. ఏకంగా దేవుడినే చేసేశారు. ఆయన కలియుగ రాముడని.. ఆయన వల్లే రామరాజ్యం వస్తుందంటూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇప్పటివకే వివాదాస్పద వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రకుమార్.. మోడీని రాముడని.. యోగిని హనుమంతుడంటూ మరోసారి వార్తల్లో నిలిచారు.

సురేంద్ర కుమార్.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే. వివాదాస్పదంగా మాట్లాడే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఇతనూ ఒకరు. ఈ మధ్య దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై స్పందిస్తూ.. వీటన్నింటికీ కారణం.. వారి వారి తల్లిదండ్రులే కారణమంటూ బాంబు పేల్చారు. అలాగే పశ్చిమబంగా సీఎం మమతాబెనర్జీని రావణుడి సోదరి శూర్పణఖగా అభివర్ణించారు. ఇవి సద్దమణిగేలోపే సురేంద్రకుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్రమోడీ.. యుగపురుషుడని.. శ్రీరామచంద్రుడి రూపంలో పునర్జన్మించారని.. సురేంద్రకుమార్ కీర్తించారు. అంతేకాకుండా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. కలియుగ చంద్రమౌర్య గుప్త అని అభివర్ణిస్తూ.. మోడికి లక్ష్మణుడిగా చెప్పుకొచ్చారు. ఇక అఖండ బ్రహ్మచారిగా ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఏకంగా హనుమంతుడితో పోల్చారు. ఈ ముగ్గురు కలిసి.. దేశంలో రామరాజ్యాన్ని స్థాపించారని.. రామరాజ్య కలను నెరవేరుస్తున్నారని.. సురేంద్రసింగ్ పేర్కొన్నారు.

అంతేకాకుండా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కూడా సెటైర్లు వేశారు. ఆయనకు దేశానికి నాయకత్వం వహించే సత్తా ఏమాత్రం లేదన్నారు. రాహుల్ దేశానికి ప్రధాని అవుతానని చెప్పడం మన దురదృష్టం అని.. ఒకవేళ ఆయనే ప్రధాని పదవి చేపడితే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదన్నారు. రాహుల్ పగటి కలలు కంటున్నారని.. సురేంద్రకుమార్ ఎద్దేవా చేశారు. సాధారణంగా వ్యక్తి పూజకు ఆమడదూరంలో ఉండే బీజేపీ నాయకులు.. ఈ మధ్య అదే మంత్రాన్ని జపిస్తున్నారు. మోడీని పొగుడుతూ.. తమకు లేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టుకుంటున్నారు.

Next Story