హైదరాబాద్ దూల్‌పేట్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్ దూల్‌పేట్‌లో ఉద్రిక్తత
x
Highlights

హైదరాబాద్‌ ధూల్‌పేట్‌లో ఉద్రిక్త వాతారవణం నెలకొంది. నిన్న రాత్రి సమయంలో ఎక్సైజ్‌ పోలీసులు గుడుంబ, గంజాయి వ్యాపారి సురేందర్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేశారు....

హైదరాబాద్‌ ధూల్‌పేట్‌లో ఉద్రిక్త వాతారవణం నెలకొంది. నిన్న రాత్రి సమయంలో ఎక్సైజ్‌ పోలీసులు గుడుంబ, గంజాయి వ్యాపారి సురేందర్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేశారు. దీంతో అతని కుటుంబసభ్యులు... ఈ మధ్యాహ్నం పోలీస్ట్‌ స్టేషన్‌పై, ఎక్సైజ్‌ ఏసీపీ నవీన్‌ కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. ఈక్రమంలో అడ్డొచ్చిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశారు. అయితే పోలీసులు పలువురి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్తి బాయి, ఆమె కొడుకు ఉద్దేశ్‌సింగ్‌ గంజాయి విక్రయం కేసులో గతంలోనూ అరెస్టయి జైలు శిక్ష అనుభవించారు.ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. గంజాయి విక్రయాన్నే వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న గంజాయి విక్రయిస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే, వీరిద్దరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు రిమాండ్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో నిందితులకు చెందిన సుమారు 15 మంది పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కేసులు నమోదు చేయకుండా వారిని వదిలేయాలని కోరారు. గతంలో అరెస్టయినా ఏమాత్రం వారిలో మార్పురాలేదని, రిమాండ్‌కు తరలించి తీరతామని అధికారులు తేల్చి చెప్పడంతో ఇరువురు మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న నిందితులిద్దరినీ విడిపించుకొని తీసుకెళ్లిపోయారని సమాచారం. దీనిపై మంగళహాట్‌ పోలీసులకు ఎక్సైజ్‌ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories