Top
logo

కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు...మీసాలు మెలిపెడితే.. ఉన్న వెంట్రుకలు ఊడుతాయి..

కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు...మీసాలు మెలిపెడితే.. ఉన్న వెంట్రుకలు ఊడుతాయి..
X
Highlights

ప్రత్యర్థులను సూటిగా హెచ్చరించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ. నాయకత్వ లక్షణాలనేవి పుట్టుకతో రావాలని,...

ప్రత్యర్థులను సూటిగా హెచ్చరించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ. నాయకత్వ లక్షణాలనేవి పుట్టుకతో రావాలని, ఈ విషయంలో కొండా మురళి ఒరిజినల్‌ బ్రిడ్‌ అని తేల్చేశారు. హైబ్రిడ్‌ మనుషుల మాదిరిగా వచ్చిరాని వేషాలు వేస్తే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో కొంతమంది మీసాలు మెలేస్తున్నారని, కొత్తగా మీసాలు మెలేస్తే ఉన్నవి ఊడుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ ఎల్‌బీనగర్‌లోని అబ్నూస్‌ ఫంక్షన్‌ప్యాలెస్‌లో మంగళవారం వివిధ మత పెద్దల సమక్షంలో ఈద్‌ మిలాప్‌ (పండుగ కలయిక) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేఖ మాట్లాడుతూ.. నాయకత్వ లక్షణాలు పుట్టుకతో రావాలని అన్నారు. కొండా మురళి ఒరిజినల్‌ బీడ్‌ అని, హైబ్రీడ్‌ జాతి మనుషులు వచ్చిరాని వేషాలు వేస్తే సహించేదిలేదని కొంతమందికి ఈ వేదిక ద్వారా హె చ్చరిక చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా తమకు ఇలాగే అందించాలని కోరారు.

Next Story