విశ్వ సుందరిగా దక్షిణాప్రికా భామ

Highlights

విశ్వసుందరి కిరీటం ఈసారి దక్షిణాప్రికా భామను వరించింది. లాస్‌ వెగాస్‌లో జరిగిన 2017 మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో డెమిలీ నెల్‌ పీటర్స్ విజేతగా నిలిచింది....

విశ్వసుందరి కిరీటం ఈసారి దక్షిణాప్రికా భామను వరించింది. లాస్‌ వెగాస్‌లో జరిగిన 2017 మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో డెమిలీ నెల్‌ పీటర్స్ విజేతగా నిలిచింది. మిస్‌ యూనివర్స్‌ కిరిటాన్ని దక్కించుకున్న రెండో దక్షిణాప్రికా యువతిగా నిలిచింది. 92 దేశాలకు చెందిన అందగెత్తులు పాల్గొన్న ఈ పోటిల్లో అందరిని వెనక్కి కిరిటాన్ని సొంతం చేసుకుంది. 22ఏళ్ల డెమి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కలర్‌ఫుల్‌గా సాగిన ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన బామలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.

అదరహో అనిపించిన ఈ పోటీల్లో కొలంబియాకు చెందిన లారా గొంజాలెజ్‌ తొలి రన్నరప్‌గా, జమైకాకు చెందిన డెవీనా బెన్నెత్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. మానుషి చిల్లర్‌ రూపంలో ఇటీవల ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్న భారత్‌ ఈ పోటీల్లో 10వ స్థానం దక్కించుకుంది. భారత్‌కు చెందిన శ్రద్ధ శశిధర్‌ టాప్‌ 10లో నిలిచారు. 2000 సంవ‌త్స‌రంలో లారా ద‌త్తా త‌ర్వాత మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో భారత సుంద‌రీమ‌ణులు కిరీటాన్ని సంపాదించ‌లేక‌పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories