Top
logo

భయం గుప్పిట్లో ఆ దేశప్రజలు..ఎవరు మరణిస్తారో కనిపెట్టేస్తున్న ఆస్కార్

Highlights

ఆస్కార్ ఆస్కార్ అంటే సినీ రంగంలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అని మనకు తెలుసు. కానీ ఆస్కార్ పేరుతో ఓ...

ఆస్కార్
ఆస్కార్ అంటే సినీ రంగంలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అని మనకు తెలుసు. కానీ ఆస్కార్ పేరుతో ఓ పిల్లి ఉందని మీకు తెలుసా. అది ఆస్కార్ అవార్డు కంటే ఫేమస్ అని ఎప్పుడైనా విన్నారా. అస్కార్ క్యాట్ స్పెషాలిటీ ఏంటంటే చావును ఇది ముందే పసిగడుతుంది. అవును మీరు విన్నది అక్షరాల నిజం. దీనిపై పరిశోదనలు చేసిన శాస్త్రవేత్తలు కూడా దీని శక్తి చూసి ఆశ్చర్యపోతున్నారు.
సెంట్రల్ స్ట్రీట్ హౌస్ నర్సింగ్ రిహాబ్లిష్‌డ్ సెంటర్
ఇక వివరాల్లోకి వెళితే ఈ ఆస్కార్ క్యాట్ ఉండేది. రోడే హైల్యాండ్స్ లోని సెంట్రల్ స్ట్రీట్ హౌస్ నర్సింగ్ రిహాబ్లిష్‌డ్ సెంటర్. డాక్టర్ డేవిడ్ దోసా జెరిట్రోషియన్ ఆస్పత్రిలో పెరిగిన ఈ పెంపుడు పిల్లి ప్రత్యేకతను సంతరించుకోని ప్రపంచవ్యాప్తంగా అందరినోట్లో నానుతోంది. ఓ వింత వార్తవిని ప్రపంచం నెవ్వరపోయింది. పరిశోదకులు తత్తరపోయారు. శాస్త్రవేత్తలు బిత్తరపోయారు. ఓ సాధారణ పిల్లి మరణాన్ని ముందుగా పసిగట్టడమా..? ఇదంతా ట్రాష్ అని కొందరు అంటుంటే శక్తులు కలిగిన మేధావులు లోకంలో ఎందరు లేరు.వారిలాంటి ప్రత్యేకతే వీరికి ఉంటుందని మరికొందరు అన్నారు. ఈ పిల్లి ఆరునెలల వయస్సు ఉన్నప్పుడే డాక్టర్ డేవిడ్ డోసా . ఆస్కార్ లో విచిత్రమైన శక్తి ఉందని గుర్తించారు. ఆస్కార్ ఎవరి బెడ్ కిందకి వెళ్లి తే పైనున్న వారికి కాలం చెల్లినట్లే . మృత్యువు కబళించినట్లే. ఎవరైతో రిహాబ్లిష్ సెంటర్లో మరో 24గంటల్లో మరణిస్తారో వారి బెడ్ కింద ఆస్కార్ ఖచ్చితంగా చేరుతుంది. మొదట్లో ఈ విషయాన్ని ఎవరు నమ్మలేదు. మామూలు రోజుల్లో రిహాబ్లిష్ సెంటర్లో సాధారణంగా ఓ మూలన సేద తీరే ఆస్కార్ క్యాట్ రోగి మృతి చెందుతున్నాడంటే అతని బెడ్ కిందకు చేరి సైలెంట్ గా పడుకుంటుంది. ఏం చేసినా అక్కడికి చేరదు. ఆ బెడ్ ను వీడదు. ఇలాంటి చాలా సందర్భాలున్నాయి. ఇది పదే పదే రిపీట్ కావడంతో అక్కడి డాక్టర్లు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ అంశాన్ని మరింత నిర్ధారణ చేసుకునే క్రమంలో వైద్యులు చాలా ప్రయోగాలు చేశారు. ఏ బెడ్ కింద అయితే ఆస్కార్ పడుకుంటుందో ఆ బెడ్ పై ఉన్న పేషెంట్ ను మరో బెడ్ పై మార్చిచూశారు. విచిత్రం ఏమిటంటే బెడ్ మార్చినా చనిపోయే వారి బెడ్ కింద పడుకునేదట. అలా కాదని ఆస్కార్ ఎవరి బెడ్ కింద్ర అయితే పడుకుంటుందో వారిని బ్రతికించేందుకు సర్వశక్తులా ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం ఇలా వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో ఆరోగి మృతి చెందాడట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రిహాబ్లిష్ సెంటర్లో మరో ఐదు పిల్లులు ఉన్నాయట. వాటిలో ఈ పిల్లికి ఉన్న వింత లక్షణాలు ఏ పిల్లికి లేవని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.
ఈ పిల్లి మరణాన్ని ఎలా గుర్తిస్తుందంటే
పరిశోధకులు, మేధావులు ఈ పిల్లి ప్రవర్తనను విశ్లేషించారు. మూర్చను ముందుగా గుర్తించే శునకాలు. క్యాన్సర్ ను గుర్తించే ప్రత్యేక శునకాలు అయితే రోగి శరీరం నుంచి వెలువడే వాసన పసిగట్టి ప్రమాదాన్ని గుర్తించగలుగుతున్నాయో ...మరణించే ముందు సంభవించే కెమికల్ కారణంగా వారి శరీరం నుంచి వెలువడే ఏదో వాసనను ఈ పిల్లి గ్రహించి వారి మరణాన్ని ముందుగా గుర్తించగలుగుతుందని అభిప్రాయానికి వచ్చారు. అయితే మరణించే వారి నుంచి వచ్చే వాసనను గుర్తించి తద్వారా చికిత్స ద్వారా మనిషిని బ్రతికుంచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story