Top
logo

బతికుండగానే.. చంపేశారు

బతికుండగానే.. చంపేశారు
X
Highlights

పాము కరిచింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను ఆస్పత్రికి తరలిస్తే.. బతికుండగానే శవపరీక్ష చేసిన ఘోరం...

పాము కరిచింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను ఆస్పత్రికి తరలిస్తే.. బతికుండగానే శవపరీక్ష చేసిన ఘోరం వరంగల్‌లో చోటుచేసుకుంది. బతికుండగానే చనిపోయిందని.. శవపరీక్షకు పంపిన ప్రైవేటి ఆస్పత్రి వైద్యులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయతీ పరిధి హవల్దార్‌పల్లికి చెందిన గూళ్ల సదానందం కుమార్తె రిషిత(13) ఈ నెల 19న ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి పాము కాటేసింది. కుటుంబ సభ్యులు తొలుత ముల్కనూర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పట్టించుకోకపోవడంతో హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలిక చనిపోయినట్టు మంగళవారం నిర్ధారించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించడంతో, పోస్టుమార్టం వేళ, పాప ఇంకా బతికే ఉందని గుర్తించిన వైద్యులు, అత్యవసర చికిత్స చేసినప్పటికీ, ఫలించలేదు. అప్పటికే విషం శరీరమంతా వ్యాపించగా, మంగళవారం సాయంత్రం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మల్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.

Next Story