Top
logo

కూటమి అధికారంలోకి వస్తే… రాష్ట్రంలో సంక్షోభం తప్పదు

కూటమి అధికారంలోకి వస్తే… రాష్ట్రంలో సంక్షోభం తప్పదు
X
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నంలో రైతు...

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నంలో రైతు సమ్మేళన సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాకే మహాకూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడగాలన్నారు. సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో తెలుగుదేశం ఉండదు. తెలంగాణ ద్రోహితో జతకట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. ఉద్యమించే వాడినే తెలంగాణ కోరుకుంటుంది. గులాంగిరి చేసేవారికి తెలంగాణ సమాజం ఎన్నడూ అండగా ఉండదు. సంక్షేమం కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయండి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Next Story