చంద్రబాబు కుట్రదారు : హరీశ్‌రావు

చంద్రబాబు కుట్రదారు : హరీశ్‌రావు
x
Highlights

కాంగ్రెస్ నేతలు అధికారం కోసం చంద్రబాబు దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అమర వీరుల త్యాగాలను...

కాంగ్రెస్ నేతలు అధికారం కోసం చంద్రబాబు దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అమర వీరుల త్యాగాలను అపహాస్యం చేసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం, కూకట్‌పల్లిలో చంద్రబాబుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు జిల్లాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీ,కాంగ్రెస్ నేతలంతా ఒక్కటై ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణ మనుగడను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మంత్రి హరీష్‌రావు. అధికారం కోసం చంద్రబాబు వేసిన ట్రాప్‌లో కాంగ్రెస్ నేతలు ఇరుక్కున్నారంటూ ఆయన విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories