ఏటీఎంలో ఎలుకలు పడ్డాయ్.!

ఏటీఎంల నుంచి జనాలకు డబ్బు రాకపోయినా ఎలుకలకు మాత్రం మేత బాగా దొరుకుతోంది. ఎటీఎంలలో ఉంచిన నగదును ఎలుకలు చిత్తు...
ఏటీఎంల నుంచి జనాలకు డబ్బు రాకపోయినా ఎలుకలకు మాత్రం మేత బాగా దొరుకుతోంది. ఎటీఎంలలో ఉంచిన నగదును ఎలుకలు చిత్తు కాగితాలుగా కొరికి వేసిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టిన్సుకియా లైపులిలోని ఓ ఏటీఎంలో 12 లక్షల రూపాయలను ఎలుక తినేసింది. గత నెల 20 నుంచి అవుట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉన్న ఈ ఏటీఎమ్‌ను బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఏటీఎంలోకి చొరబడిన ఎలుక అందులో ఉన్న నోట్లను తినేసింది. నాలుగు రోజుల క్రితం ఏటీఎం రిపేరు చేసేందుకు వచ్చిన అధికారులు విషయం తెలుసుకుని ఖంగుతున్నారు. ఎలుకలు తిన్న వాటిలో 500, రెండు వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఏటీఎంలలో పటిష్టమైన బాక్సులలో ఉంచిన నగదును ఎలుకలు తినడంపై స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిదంటూ విమర్శిస్తున్నారు. నష్టాలు చూపడం జనంపై ఎడపెడా చార్జీలు బాదడం అలవాటైన బ్యాంకు యాజమాన్యాలకు ఇలాంటి ఘటనలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT