ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు..

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు..
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్ మస్ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రెండువేల సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ప్రభువు జన్మదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్...

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్ మస్ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రెండువేల సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ప్రభువు జన్మదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే వాటికన్ సిటీలోనూ క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. యేసు నామాన్ని జపిస్తూ చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్థరాత్రి నుంచే క్రీస్తు రాకకోసం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలను అలకరించారు. క్రీస్తు ప్రార్థననలతో చర్చీల్లో సందడి కనిపిస్తోంది. ఈ పర్వదినం రోజున ప్రత్యేక ప్రార్థనలు చేస్తే క్రీస్తు ప్రేమాభిమానాలు దక్కుతాయంటున్నారు క్రైస్తవులు.

క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆసియాలోనే అతి పెద్దదైన మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఉదయం నుంచే ప్రార్ధనలకు పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివస్తున్నారు. ఇతర జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ప్రజలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసు జననం ప్రజలకు సంతోషకరమైన సమయమని గవర్నర్ నరసింహన్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories