Top
logo

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం...నలుగురు మృతి

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం...నలుగురు మృతి
X
Highlights

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ సెంటర్‌లో భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు...

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాశిబుగ్గ సెంటర్‌లో భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయ్. 2 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. ప్రమాదం జరిగిన భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో 13 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటికే నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం సమయంలో 13 మంది కార్మికులుంటే ఇప్పటికే నలుగురి మృతదేహాలను వెలికితీశారు. భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన స్థలం వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story