logo
జాతీయం

ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలి

ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలి
X
Highlights

హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాఖ్‌, నిఖా హలాల వంటి దురాచారాల...

హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాఖ్‌, నిఖా హలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాచి పేర్కొన్నారు. ఇటువంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్‌(బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story