logo
జాతీయం

రాజీవ్‌ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర!

రాజీవ్‌ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర!
X
Highlights

ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లానేసినట్లు తెలుస్తోంది. మావోలు నిర్వహిస్తున్న ఇంటర్నల్...

ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లానేసినట్లు తెలుస్తోంది. మావోలు నిర్వహిస్తున్న ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను పుణె పోలీసులు గుట్టురట్టు చేశారు. దీంతో వాళ్లకు మోడీ హత్య గురించి వేసిన ప్రణాళికలు తెలిశాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే.. ప్రధాని మోడీని కూడా టార్గెట్ చేయాలని మావోలు ఓ లేఖలో విశ్లేషించారు. మోడీ పాలనను అంతం చేయాలని కామ్రేడ్లు ప్రతిపాదన చేశారని, రాజీవ్ గాంధీని హతమార్చినట్లుగా ప్లాన్ వేయాలని, మనం విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నా, దానిపై మరింత వర్క్ చేయాల్సిన పని ఉందని, రోడ్‌షో సమయంలో మోడీని టార్గెట్ చేయడం ఉత్తమం అని మావోలు ఓ లేఖలో అభిప్రాయపడ్డారు. కామ్రేడ్ ప్రకాశ్‌కు వందనాలు తెలుపుతూ మిగతా మావోలు లేఖ రాసినట్లు తెలుస్తోంది. కామ్రేడ్ కిషన్‌తో పాటు ఇతర కామ్రేడ్లు ఈ లేఖను రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఆ లేఖను రాసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Next Story