Top
logo

బ్యానర్ల కింద బాంబులు

బ్యానర్ల కింద బాంబులు
X
Highlights

జయశంకర్‌ భూపాలపల్లిలో మావోయిస్టుల బాంబు కలకలం రేపుతోంది. ఎన్నికలను బహిష్కరించాలంటూ వెంకటాపురం మండలం ఉప్పెడు...

జయశంకర్‌ భూపాలపల్లిలో మావోయిస్టుల బాంబు కలకలం రేపుతోంది. ఎన్నికలను బహిష్కరించాలంటూ వెంకటాపురం మండలం ఉప్పెడు వీరాపురంలో మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. ఓ కిరాణా షాపు దగ్గర బ్యానర్‌ కట్టిన మావోయిస్టులు.. దాన్ని తొలగించకుండా బాంబు అమర్చారు. ఎవరైనా బ్యానర్‌ తొలగించేందుకు ప్రయత్నిస్తే పేలిపోయేలాగా బాంబుకు వైర్లు అమర్చారు. ఉప్పెడు వీరాపురంలో మావోయిస్టుల బాంబుతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. షాపులతో పాటు రోడ్లపై రాళ్లు పేర్చి మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. ఊరంతా బ్యానర్లు ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Next Story