Top
logo

చత్తీస్‌గఢ్‌లో తప్పిన మరో భారీ ప్రమాదం

చత్తీస్‌గఢ్‌లో తప్పిన మరో భారీ ప్రమాదం
X
Highlights

ఛత్తీస్‌గఢ్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలకు తెగబడుతున్న మావోయిస్టులు .. మరో భారీ ...

ఛత్తీస్‌గఢ్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలకు తెగబడుతున్న మావోయిస్టులు .. మరో భారీ దాడికి చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుకుమా, నారాయణపూర్ అటవీ ప్రాంతాల్లో భారీగా ల్యాండ్ మైన్స్‌ను పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు10 ల్యాండ్ మైన్స్‌ను వెలికితీసిన పోలీసులు ..అణువణువునా శోధిస్తున్నారు. కూంబింగ్ బలగాలు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా మావోయిస్టులు వీటిని అమర్చినట్టు గుర్తించారు. గత శుక్రవారం ఇక్కడే జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఓ వైపు మావోయిస్టుల దాడులు మరో వైపు కూంబింగ్ బలగాలతో స్ధానిక గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు.

Next Story