ఆప్‌, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

ఆప్‌, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ
x
Highlights

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఢిల్లీలోని సిగ్నేచర్‌ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ భాజపా చీఫ్‌ మనోజ్‌...

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఢిల్లీలోని సిగ్నేచర్‌ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ భాజపా చీఫ్‌ మనోజ్‌ తివారీ, ఆయన అనుచరులు సిగ్నేచర్‌ బ్రిడ్జిపైకి వచ్చారు. దీంతో అక్కడే ఉన్న ఆప్‌ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో ఘర్షణకు దారితీసింది. దింతో హుటాహుటినా ఘటనస్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితి చక్కబెట్టేందుకు యత్నించారు. ఎన్నో వాయిదాలు, పనులు ఆపేసిన తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో సిగ్నేచర్‌ వంతెన పూర్తయ్యింది.

నా నియోజకవర్గంలో, సిగ్నేచర్‌ బ్రిడ్జి వంతెన పనులు ఎన్నో ఏళ్లు నిలిచిపోయిన తర్వాత తిరిగి నేను నిర్మాణ పనులు ప్రారంభించాను. ఇప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తున్నారు. నేను ఇక్కడ ఎంపీని. మీకు సమస్య ఏంటి? నేను ఏమైనా నేరస్థుడినా? ఎందుకు నన్ను పోలీసులు చుట్టుముట్టారు?. నేను కేజ్రీవాల్‌ను ఆహ్వానించడానికి ఇక్కడ ఉన్నాను. ఆప్‌, పోలీసులు నాతో అనుచితంగా ప్రవర్తించారు’ అని మనోజ్‌ తివారీ వెల్లడించారు.

ఈ ఘటనపై కేజ్రీవాల్‌ ట్విటర్‌లో స్పందించారు. బీజేపీపై విమర్శలు చేశారు. సిగ్నేచర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవ ప్రదేశంలో బీజేపీ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఇది దిల్లీ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పోలీసులు పట్టించుకోవడం లేదని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కల్పించుకుని ప్రారంభోత్సవ ప్రదేశంలో శాంతి భద్రతల నెలకొల్పాలని కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories