logo
సినిమా

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు!

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు!
X
Highlights

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన చెన్నై అపోలో...

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మణిరత్నం పలు హిట్ చిత్రాలు తెరకెక్కించారు. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన గీతాంజలి చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రముఖ సినీ నటి సుహాసినిని మణిరత్నం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మణిరత్నం అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం బిజీగా ఉన్నారు. రోజా, దళపతి, నాయకుడు, ఒకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించారు. మణిరత్నం వయసు ఇప్పుడు 62 సంవత్సరాలు.

Next Story