'మా'పై నిప్పులు చెరిగిన మంచు విష్ణు

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. రోజురోజుకీ కొత్త పాత్రలు ఎంటరవుతున్నాయి....
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. రోజురోజుకీ కొత్త పాత్రలు ఎంటరవుతున్నాయి. థ్రిల్లర్ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ నడుస్తోంది. కొత్తగా రాజకీయ పాత్రలు కూడా వచ్చి చేరాయి. ఇఫ్పుడు తాజాగా హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌పై నిప్పులు చెరిగాడు. శ్రీరెడ్డి వ్యవహారంలో మా వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు శ్రీరెడ్డిపై ఏ హక్కుతో నిషేధం విధించారు? తిరిగి ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించారు. మా అధ్యక్షుడు శివాజీరాజాకి లేఖాస్త్రం సంధించిన మంచు విష్ణు శ్రీరెడ్డి ఇష్యూలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహరించిన తీరును నిలదీశారు. అసలు మాకెందుకు చెప్పలేదంటూ మంచు విష్ణు ఘాటుగా ప్రశ్నించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర గందరగోళంగా ఉన్నాయన్న మంచు విష్ణు ఎవర్నడిగి శ్రీరెడ్డిపై నిషేధం విధించారో చెప్పాలని నిలదీశారు. 900మంది ఉన్న 'మా'లో తమ కుటుంబ సభ‌్యులు కూడా ఉన్నారని గుర్తుచేసిన మంచు విష్ణు తమ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మళ్లీ ఎవర్నడిగి నిషేధం ఎత్తివేశారో చెప్పాలన్నారు. హడావిడిగా మీటింగ్ పెట్టి నిషేధం విధించారు... మళ్లీ హడావిడిగా మీటింగ్ పెట్టి నిషేధం ఎత్తివేశారు అంతా మీ ఇష్టమేనా అంటూ ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీసుకుంటోన్న నిర్ణయాలతో మాపై వ్యతిరేకత పెరుగుతోందని మండిపడ్డారు. మీ అనాలోచిత నిర్ణయాలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌పై ప్రజల్లో చులకన భావన ఏర్పడుతోందని మంచు విష్ణు ఘాటు కామెంట్స్ చేశారు.
అసలు నటీనటులకు సరైన మార్గదర్శకాలు ఎక్కడున్నాయంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ను మంచు విష్ణు సూటిగా ప్రశ్నించారు. తక్షణమే మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 24 క్రాఫ్ట్‌లకు కూడా ఆ మార్గదర్శకాలను వర్తింపజేయాలని మంచు విష్ణు కోరాడు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో సభ్యత్వంలేని అనేకమంది స్థానిక నటులు ఉన్నారని వారందరితో నటించేందుకు తనను అనుమతిస్తారా? అంటూ విష్ణు నిలదీశారు. మీ చేష్టలతో ప్రజల్లో, మీడియాలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చులకన అవుతోందని, దయచేసి మీ అనాలోచిత నిర్ణయాలతో మాను భ్రష్టు పట్టించొద్దని కోరారు. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు టాలీవుడ్ పరువు తీసేస్తోందన్న విష్ణు ఫిర్యాదుల సెల్ ఏర్పాటు బాధ్యతను "మా" కాకుండా ఫిల్మ్ ఛాంబర్ తీసుకోవాలని కోరారు.
శ్రీరెడ్డిపై ఎవర్నడిగి నిషేధం విధించారు? మళ్లీ ఎవర్నడిగి నిషేధం ఎత్తివేశారంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ను సూటిగా ప్రశ్నించడమే కాకుండా అసలు తమకెందుకు చెప్పలేదంటూ మంచు విష్ణు నిలదీయడంతో మా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMT