logo
సినిమా

శబరిమల వివాదంపై స్పందించిన మంచు మనోజ్‌

శబరిమల వివాదంపై స్పందించిన మంచు మనోజ్‌
X
Highlights

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు...

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఓ అభిమాని సేవ్‌ శబరిమల క్యాంపెయిన్‌పై ఇప్పటికైనా నోరు విప్పండి అంటూ మనోజ్‌ ను ట్యాగ్‌చేస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించాడు మనోజ్‌.. ‘మనం పేదలకు నీరు, ఆహారం, చదువు లాంటి కనీస అవసరాల తీర్చడంపై ముందుగా బాధపడాలి. మనకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆయన, తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడండి’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్‌. మనోజ్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ అంశంపై నెటిజన్ మనోజ్‌తో రామ్ చరణ్‌ను కూడా ట్యాగ్ చేశాడు. మరి రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Next Story