Top
logo

అత్తాపూర్ లో మర్డర్.. అక్రమ సంబంధం కారణంగానే రమేశ్ హత్య!

అత్తాపూర్ లో మర్డర్.. అక్రమ సంబంధం కారణంగానే రమేశ్ హత్య!
X
Highlights

హైదరాబాద్‌‌లో మరో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై పట్టపగలు నడిరోడ్డు మీద కత్తితో దాడి చేసిన...

హైదరాబాద్‌‌లో మరో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై పట్టపగలు నడిరోడ్డు మీద కత్తితో దాడి చేసిన ఘటన కళ్ల ముందు మెదులుతుండగానే అత్తాపూర్‌‌లో ఇదే తరహాలో దాడి జరిగింది. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దుండగులు కత్తితో దాడి చేశారు.

సిద్ధిఅంబర్‌ బజార్‌కు చెందిన రమేశ్‌ ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు హాజరయ్యాడు. తిరిగి వెళుతుండగా కాపుకాసిని ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడికి దిగారు. పారిపోతున్న రమేష్‌ను పీవీ ఎక్స్‌ప్రెస్‌ 143వ పిల్లర్‌ దగ్గర అత్యంత పాశవికంగా హతమార్చారు. స్ధానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా దుండగులు ఎదురుదాడికి దిగారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నా ఏమాత్రం భయపడకుండా చచ్చేంత వరకు నరికారు.

వివాహేతర సంబంధాల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం సాగిస్తున్న మహేష్ అనే యువకుడిని ఆరు నెలల క్రితం రమేష్ హతమార్చాడు. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న రమేష్‌ విచారణ కోసం కోర్టుకు హాజరయ్యాడు. ఈ సమయంలో రమేష్ హత్యకు మహేష్‌ తండ్రి కుట్రపన్నాడు. ఈ ఘటనలో మహేష్ తండ్రికి మరో ముగ్గురు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. పిల్లర్ నెంబర్ 138 నుంచి 143 వరకు నిందితుడిని వెంటాడినట్టు సీసీ పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.

Next Story