బతికున్న పామును మింగి.. 4 గంటల్లోనే
ఫుల్లుగా తాగి ఉన్న వ్యక్తిని ఆకతాయిలు రెచ్చగొట్టడంతో ఓ పాము పిల్లను అమాంతం మింగేశాడు. 4 గంటల్లో ఒళ్లంతా విషం...
ఫుల్లుగా తాగి ఉన్న వ్యక్తిని ఆకతాయిలు రెచ్చగొట్టడంతో ఓ పాము పిల్లను అమాంతం మింగేశాడు. 4 గంటల్లో ఒళ్లంతా విషం వ్యాపించి అతను చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న మహిపాల్ సింగ్(40) బుధవారం ఫుల్లుగా తాగి ఇంటికి వస్తుండగా అతనికి రోడ్డు పక్కన ఓ పాము పిల్ల కనిపించింది. దాన్ని తీసుకొని సరదాగా ఆడుకుంటుండగా కొందరు ఆకతాయిలు అక్కడికి చేరుకుని ఫోన్లలో వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సింగ్ పాముపిల్లను తన పిడికిలిలో పట్టుకుని, రోడ్డుపై వేసి, తలమీద పెట్టుకుంటూ ఆటలాడసాగాడు. ఇంతలోనే ఓ ఆకతాయి పామును నోట్లో పెట్టుకుంటావా? అని అడగడంతో సింగ్ వెంటనే తన నోట్లో పెట్టుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. నోట్లో పెట్టుకున్న పాము కాస్తా చేతిలో నుంచి జారీ గొంతులోంచి లోపలికి వెళ్లిపోయింది. వాంతులు చేస్తూ ఎంత ప్రయంత్నించినా లోపలికి వెళ్లిన పాము బటయకు రాలేదు. చివరకు 4 గంటల్లోపే పాము విషం అతని ఒళ్లంతా వ్యాపించి చనిపోయాడు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT