logo
సినిమా

మహేశ్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు?

మహేశ్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు?
X
Highlights

43 ఏళ్లొచ్చిన పాతికేళ్ల కుర్రాడాలానే కనిపించే మహేశ్, అసలు టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు? పిల్లల నుంచి...

43 ఏళ్లొచ్చిన పాతికేళ్ల కుర్రాడాలానే కనిపించే మహేశ్, అసలు టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు? పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికి నచ్చిన స్టార్ గా ఎలా ఎదిగాడు తండ్రిని మించిన స్టార్ గా ఎలా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు..? 19 ఏళ్లలో 25 సినిమాలే తీసినా, తనకే టాలీవుడ్లో, అలానే ఆల్ ఓవర్ ఇండియాలోనే అంత ఇమేజ్ ఎలా సొంతమైంది?

బాలీవుడ్ జనం ఎక్కువ కోరుకునే టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఎన్ని హిట్లున్నా, టాలీవుడ్ లో బాలీవడ్ హీరోకుండేన్ని ఫీచర్స్ ఉన్నా, బాలీవుడ్ వదులుకున్న హీరో కూడా మహేశే ఫ్యామిలీ, సినిమా తప్ప మరో ఆలోచనలేదు కంప్లీట్ ఫిల్మ్ స్టార్, ప్రొఫేషనల్ స్టార్ మహేశ్ బాబు.

ప్రిన్స్ మహేష్ బాబు క్లాస్ మాస్, అని తేడాలేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఫాలో వర్స్ ని పెంచుకున్న ఒకే ఒక్క హీరో ప్రిన్స్ మహేష్ బాబు. 40 ప్లస్ లోకూడా పాతికేళ్ల యువరాజులా దూసుకపోతున్న మహేశ్ , 19 ఏళ్లలో 24 సినిమాలు చేశాడు పాతికో మూవీతో బిజీ అయ్యాడు. మహేశ్ బాబు అంటే సైలెంట్ గా పంచ్ డైలాగ్స్ విసిరే, కిల్లర్ ఎక్కడా అరవడాలు, హెవీ డైలాగులుండవ్ సూటిగా సుట్టిలేకుండా, అలా డైలాగ్స్ విసురుతాడు. పొదుపైన మాటలని, తూటాల్లా పేల్చే స్టార్ ప్రిన్స్ . ఐతే, ఆ డైలాగ్స్ లోనే, పాతిక సినిమాలకు పాతిక ముప్పై వేరియేషన్స్ చూపించిన స్టార్ మహేశ్

లెంథీ డైలాగ్స్ లేకుండా, పొదుపైన మాటలతో, పంచ్ డైలాగ్స్ పేల్చి, ట్రెండ్ సెట్ చేసిన స్టార్ మహేశ్ బాబు. పదాలని పొదుపుగా వాడుతూ, అరవటాల్లేకుండా కూడా పంచ్ డైలాగ్స్ పేల్చొచ్చని ప్రూవ్ చేసి, డైరెక్టర్స్ హీరో, మహేశ్ బాబు ఆ క్వాలిటీస్ తోనే యంగ్ ఏజ్ నుంచి సూపర్ స్టార్ గా ఫోకస్ అయిన వన్ అండ్ ఓన్లీ స్టార్ ప్రిన్స్ . మహేశ్ బాబు అంటేనే హెవీ యాక్షన్ స్టార్ డూప్స్ పెట్టుకోకుండానే ఎక్కువ రిస్కీ ఫైట్లు చేస్తుంటాడు ఫైట్స్ లో కూడా టక్కరి దొంగనుంచి భరత్ అనేనేను వరకు, ట్రెండ్ సెట్చేస్తూ వచ్చాడు. డైరెక్టర్ చెబితే, ఎంతటి రిస్క్ కి అయినా రెడీ అయిపోయే, వెరీ రేర్ స్టార్ మహేశ్ బాబు.

మాస్ హీరోలకి కామెడీ టైమింగ్ అనేది, ఇమేజ్ ఛేంజింగ్ ఫ్యాక్టర్ చిరు తర్వాత, అంతగా కామెడీ టైమింగ్ ఉన్న మరో స్టార్ మహేశ్ బాబు నవ్వకుండా నవ్వించే సీన్స్ లో, మహేశ్ ది సెపరేట్ స్టైల్ మొదట్నుంచి సీరియస్ మూడ్ లో మూవీస్ చేసి, సడన్ గా నవ్వించి షాక్ ఇచ్చి, తనలోకి కొత్త కొత్త కోణాల్ని నిధానంగా రివీల్ చేస్తున్న స్టార్ కూడా మహేశే. మహేశ్ బాబు అంటే, డైరెక్టర్స్ హీరో అంటారు దర్శకుడిని నమ్మితే, తను ఏం చెబితే అది చేయడానికి సిధ్దం ఆ ప్రాసెస్ లో పంచ్ లు పడ్డా, వెనకడుగు వేయలేదు. నమ్మితే సినిమాకోసం ప్రాణం పెడతాడు అందుకే టాలీవుడ్ టాప్ సూపర్ స్టార్ గా ఎదిగాడు.

Next Story